ముండ్లమూరు : మిలటరీ జవాన్ ఉద్యోగ విరమణ

వేముల బండ గ్రామానికి చెందిన మిలటరీ జవాన్ మామిళ్ళపల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈయన గత 18 సంవత్సరాలుగా మిలటరీ కి విశేష సేవలు అందించారు. 2005వ సంవత్సరములో ఉద్యోగం పొంది మిలటరీలో ఇప్పటివరకు 7 మెడల్స్ సాధించారు. విధుల నిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన లక్ష్మణరావును ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.

ముండ్లమూరు : మిలటరీ జవాన్ ఉద్యోగ విరమణ