దొనకొండ లో బొటుకు రమేష్ పర్యటన...పవన్ పాలన కోసం కృషి

దొనకొండ లో బొటుకు రమేష్ పర్యటన...పవన్ పాలన కోసం కృషి

*జనసేనతోనే స్థానికులకు ఆత్మగౌరవం - దొనకొండకు అభివృద్ధి సాధ్యం* 

 

జనసేన పార్టీకి జై కొడదాం - పవనన్న పాలన తీసుకువద్దాం" కార్యక్రమం లో బొటుకు  

 

జనసేన పార్టీ దర్శి నియోజకవర్గం దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు శ్రీ గుండాల నాగేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మండల కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పైడిపోగు నాగేంద్రం  గారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి దొనకొండ మండలం రాగమ్మక్కపల్లి మరియు పుచ్చకాయలపల్లి గ్రామాలలో "జనసేన పార్టీకి జై కొడదాం - పవనన్న పాలన తీసుకువద్దాం" కార్యక్రమం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమిటీ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్వీ సురేష్ , కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు శ్రీ మాదా వెంకట శేషయ్య, దర్శి నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ పుప్పాల పాపారావు,  వీర మహిళా నాయకురాలు శ్రీమతి యన్నం మార్తమ్మ గార్లు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జనసేన తోనే సాధ్యమని, ప్రజలకోసం విలాసవసంతమైన జీవితాన్ని వదులుకొని శ్రీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారని, అటువంటి మంచి వ్యక్తికి వచ్చే ఎన్నికలలో పట్టంగట్టాలని అన్నారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బొటుకు రమేష్ బాబు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ స్థానికుల ఆత్మగౌరవం నిలబెట్టిందని, గత ఎన్నికలలో స్థానికుడైన తనకు టికెట్ ఇవ్వడంద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఆత్మ గౌరవం ఇచ్చారని అన్నారు. సుమారు మూడు దశాబ్దాలకాలంగా ఇతర పార్టీ లు స్థానికేతరులకే పార్టీ టికెట్స్ ఇస్తూ నాయకులను అరువుతెచ్చుకుంటుంటే మన జనసేన పార్టీ మాత్రం స్థానికుల ఆత్మగౌరవం నిలబెడుతూ గత ఎన్నికలలో తనకు టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రజలు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదని, అందుకే ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికలలో అటువంటి తప్పుచేసి పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని, స్థానికుల గౌరవం నిలబెట్టి అభివృద్ధి సాధించమని కోరారు. అరువు తెచ్చుకున్న నాయకుల పాలనలో అభివృద్ధి సూన్యమని అన్నారు.  వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా లబ్ది, దొనకొండ పారిశ్రామిక వాడగా అభివృద్ధి, చందవరం బౌద్ధారామం పర్యాటకప్రదేశంగా అభివృద్ధి, రైల్వేజంక్షన్ లోకోమోటివే కేంద్రం పునరుద్ధరణ,  విమానాశ్రయం పునరుద్ధరణ,  దొనకొండ కేంద్రంగా స్వాతంత్ర్య సమరయోధుడు దర్శి చెంచయ్య గారి పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు, స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు గారి పేరిట దర్శి ప్రత్యేక రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, తదితర అభివృద్ధి పనులు జనసేనతోనే  సాధ్యమని గ్రహించి అందరం జనసేన కి జై కొడదాం అన్నారు. గొప్ప సిద్ధాంతాలతో, మరెంతో ప్రజాసేవతో పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వున్నారని, కౌలు రైతుల కుటుంబాలకు,  అమరావతి  రాజధాని రైతులకు అండగావున్నారని, మహిళలకు తోడుగా వున్నారని, ఉద్యోగ ఉపాధి కల్పనకు మేనిఫెస్టో లో పెద్దపీట వేశారని కనుక పవన్.పాలన నేడు చారిత్రక అవసరమని, వారి పాలన తెచ్చుకుందామని అన్నారు. సుపరిపాలన కోసం జనసేన పార్టీ  తెలుగుదేశం పార్టీ తో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందని, దీనికి మద్దతు ఇచ్చి పవన్ పాలన తెచ్చుకుందామని అన్నారు.

 

జనసేన పార్టీ దొనకొండ పట్టణ అధ్యక్షులు శ్రీ షేక్ షఫీయుల్లాఖాన్, కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ మంచాల నరసింహారావు, ప్రధాన కార్యదర్సులు శ్రీ పోలెబోయిన వెంకట్రావు, శ్రీ వరికూటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.