దర్శి కల్తీ పాల దందా గుట్టు రట్టు చేసిన జిల్లా విజిలెన్స్ & ఫుడ్ సేఫ్టీ అధికారులు

దర్శి లోని పొదిలి రోడ్ లో ఒక పాల సేకరణ కేంద్రం రైతుల దగ్గరి నుంచి పాలు సేకరించి ఆ పాల లో నూనె, కెమికల్స్ కలిపి కృత్రిమంగా ఫ్యాట్ శాతం పెంచి అధిక ధరల కు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాల తో చెలగాటం ఆడుతున్న కల్తీ రాయుళ్లు....
వివర్లోకి వెళ్తే... దర్శి లోని గాంధీ నగర్ లోని కల్తీ పాలు తయారీ కేంద్రం పై జిల్లా విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.. ఈ సందర్భముగా అధికారి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ... రైతుల దగ్గరి నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి వాటిని కల్తీ చేసి కృత్రిమంగా శాతం పెంచి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని పక్కా సమాచారం తో దాడులు నిర్వహించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.