వేణు గోపాల్ కాదు.... కలెక్షన్ గోపాల్ - నారా లోకేష్ | BSR NEWS. అనంత వాయిస్

ముండ్లమూరు యువగళం బహిరంగ సభలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టిపై నారా లోకేష్ ఘాటు విమర్శలు
భారీ మెజారిటీతో దర్శి లో గెలిపించారు, అయినా దర్శి రూపురేఖలు మారలేదు.ప్రజలు అభివృద్ధి చెందలేదు హైదరాబాదులో ఏడు కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొన్నాడు.దర్శి నియోజకవర్గం లో 80 ఎకరాల భూములు కొన్నాడు.మార్టూరులో ఏకంగా గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నాడు. ఈయన వేణుగోపాల్ కాదు కలెక్షన్ గోపాల్ అంటూ విమర్శలు . కలెక్షన్లకు ఐదు మండలాల్లో ఐదుగురు ఇన్చార్జిలను పెట్టాడనీ, బోదనంపాడు లో దళితుల భూమిని కొన్నాడు.పోలవరం ఇసుక రీచుల నుండి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించి కోట్ల రూపాయల సంపాదించాడునియోజకవర్గంలో గ్రావెల్ తరలించి కోట్ల రూపాయల దండుకున్నారు. నియోజకవర్గం లో అధికారులు మూడు నెలల కంటే ఎక్కువ ఉండలేరు.ఒక్కో అధికారికి ఒక్కో రేటు అంటూ రేట్ కార్డు ప్రకటించుకున్నారు.ఎస్సై కు 15 లక్షలు, సీఐకు 20 లక్షలు, ఎమ్మార్వో కు 20 లక్షలు అంటూ రేట్ ఫిక్స్.వైఎస్ఆర్సిపి నాయకులను, కార్యకర్తలను కూడా వదలలేదు.అభివృద్ధి పనులు చేయాలంటే నాయకులు 10% కప్పం కట్టాల్సిందే.స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆశించారు.సర్పంచులు ఎంపీటీసీలకు 20 లక్షలు, ఎంపీపీ జడ్పిటిసి లకు 30 లక్షలు అంటూ రేట్ ఫిక్స్ సింగల్ విండో ఏఎంసి పోస్టులను కూడా అమ్మేసుకున్నారు. సెంటు నివాస స్థలాలకు మూడు కోట్ల రూపాయలు దండుకున్నారు.నియోజకవర్గంలో వెంచర్లు వేస్తే కప్పం కట్టాల్సిందే అంటూ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పై ముండ్లమూరు లో జరిగిన యువగళం యాత్ర లో లోకేశ్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.