MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ తో భేటీ అయిన దర్శి MHPS నాయకులు సుభాని, సాదిక్.

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ శుబ్లీ గారితో MHPS స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ సాదిక్ మరియు దర్శి నియోజకవర్గం MHPS అధ్యక్షులు పఠాన్ సుభానీ ఈరోజు విజయవాడ లోని కేంద్ర కార్యాలయం లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫారూఖ్ షుబ్లీ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం లో MHPS ను బలోపేతం చేయాలని మైనారిటీ హక్కుల తరఫున నిలబడాలని సూచించారు. దర్శి లోనే వున్న స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ సాదిక్ తో సమన్వయం అయ్యి దర్శి నియోజకర్గంలో MHPS కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.