ప్రశ్నిస్తే దాడులా? ఎదురు తిరిగితే ఆరెస్టులా?

ప్రశ్నిస్తే... ఎదురు తిరిగితే దాడులా?
ప్రశ్నిస్తే దాడులా. ఎదురు తిరిగితే అరెస్టులా. తెలుగుదేశం పార్టీ నేతలపై అధికార పార్టీ నాయకులు దాడిని తీవ్రంగా కండిస్తున్నాం.... ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల
వెంకటేశ్వర్లు.................... గన్నవరంనియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వై యస్ అర్ పార్టీ నాయకులు దాడి చేసి ఆఫీసు లో ఫర్నీచర్ ధ్వంసం చేయడం ..కారు తగలపెట్టడం టీడీపి నేతలు పై దాడి చేయడం ప్రభుత్వం దుర్మార్గపు చర్యగా బావిస్తున్నాము... ఈ విషయం పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య... ఆంద్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా... ప్రశ్నిస్తే దాడులు.. ఎదురు తిరిగితే అరెస్టు లా... ప్రజలు అంతా గమనిస్తున్నారు... ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించి చరమగీతం పడటానికి సిద్ధంగా ఉన్నారని...ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తరుపున ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.... అని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు.