అఖిల భారత యాదవ మహాసభ నూతనంగా గ్రామ కమిటీ ఏర్పాటు

అఖిల భారత యాదవ మహాసభ నూతనంగా గ్రామ కమిటీలు
అఖిల భారత యాదవ మహాసభ దర్శి నియోజకవర్గం అధ్యక్షుడు ఎన్నాబత్తుల వెంకటసుబ్బయ్య అధ్యక్షతన నూతనంగా గ్రామ పంచాయతీ కమిటీ ఏర్పడింది. మండల అధ్యక్షుడు గాలం శ్రీను యాదవ్, కొత్తపల్లి సర్పంచ్ మండల కమిటీ ప్రతినిధి బట్టు రామారావు యాదవ్ ల ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ కమిటీ ఏర్పడింది. గ్రామపంచాయతీ కమిటీ అధ్యక్షులుగా బట్టు గోపయ్య యాదవ్, కన్నెబోయన వెంకటేశ్వర్లు యాదవ్,ఆర్ఎంపీ మామిల్ల సాంబశివరావు యాదవ్, ఉపాధ్యక్షులుగా ఏడుకొండలు యాదవ్, మోష యాదవ్ లు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆవుల వెంకటేశ్వర్లు, మహిళ విభాగం అధ్యక్షురాలుగా కన్నేబోయన అరుణ లు ఈ గ్రామ కమిటీలో నూతన పదవులు పొందారు. మొత్తం 12 మంది సభ్యులతో అఖిల భారత యాదవ మహాసభ కొత్తపల్లి గ్రామపంచాయతీ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమం కొరకు నిరంతరం పాటు పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యాదవ్ పెద్దలు, నాయకులు, కొత్తపల్లి యాదవ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.