Jagan: కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్.. ఆహ్వానం పలికిన కేటీఆర్

BSR NEWS
- కేసీఆర్ ను పరామర్శించిన జగన్
- కేసీఆర్ నివాసంలో గంటపాటు గడపనున్న ఏపీ సీఎం
- లంచ్ మీటింగ్ ఉన్నట్టు సమాచారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ విజయవాడకు తిరుగుపయనమవుతారు.