కాణిపాకం: 14న సామూహిక అక్షరాభ్యాసం BSR NEWS

కాణిపాకం: 14న సామూహిక అక్షరాభ్యాసం
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా బాసరలో జరిగేటట్లు ఏటా ఆనవాయితీగా కాణిపాకంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలతో అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.