YCP : 27న వైసీపీ ఫైనల్ లిస్ట్.. నేతలతో జగన్ కీలక భేటీ

YCP : 27న వైసీపీ ఫైనల్ లిస్ట్.. నేతలతో జగన్ కీలక భేటీ

అందుకే వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో జగన్ ఎటువంటి స్పష్టతనిస్తారో చూడాలి.

YCP : ఏపీలో సీఎం జగన్ దూకుడు పెంచారు. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం పేరిట సభలు నిర్వహిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. గుంటూరు, ప్రకాశం సరిహద్దుల్లో నాలుగో సభ ఏర్పాటుకు నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈనెల 27న 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఏవిధంగా ముందుకెళ్లాలి అన్నదానిపై దిశా నిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో హై కమాండ్ నిమగ్నమైంది.

తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను డిసైడ్ చేసింది. అటు బిజెపి సైతం కూటమిలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయం హీటెక్కిే అవకాశం ఉంది. ఈ తరుణంలో జగన్ ఈ కీలక భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి లోని సీకే కన్వెన్షన్ హాల్లో సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం అందించారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ శ్రేణులతో ఇదే ఫైనల్ మీటింగ్. కీలక అంశాలపై జగన్ ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీకి ఏపీ ప్రజలు ఏకపక్ష విజయం కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదంటూ విశ్లేషణలు వస్తున్నాయి. గట్టి ఫైట్ ఉంటుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడంతో పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. కీలక నియోజకవర్గాల్లో సైతం నాయకుల మార్పు పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు వై నాట్ 175 అన్న నినాదంతో వైసీపీ ముందుకెళ్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా.. వైసిపి భయపడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అందుకే జగన్ తాను ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అభ్యర్థులను మార్చింది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అన్నదానిపై జగన్ స్పష్టతనివ్వనున్నారు. అయితే ఎన్నికల ముంగిట ఇదే చివరి సమావేశం అని తెలుస్తోంది. పలుమార్లు వర్క్ షాపుల పేరిట సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతానని అప్పటి నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చారు. కానీ ఈ ఏడు జాబితాలతో జగన్ సరి పెడతారని.. ఇదే సమావేశంలో తుది జాబితా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో జగన్ ఎటువంటి స్పష్టతనిస్తారో చూడాలి.