కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి విజయవాడ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై 2015లో నమోదైన ఓ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న పాత కేసును గురువారం విజయవాడ కోర్టు కొట్టివేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2015లో తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నాయకులు ధర్నా చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.2015లో తొండూరులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని కర్నాటక సరిహద్దుల్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి మృతదేహాలతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సహా పలువురు తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.