కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల #ఉచిత_సబ్సిడీ_పథకాలు - #చిన్నకారు_రైతు కుటుంబ ప్రాతిపదికగా విశ్లేషణ
-----------------------------------------------
BRS NEWS TELUGU
రైతు స్వరాజ్య వేదిక
-----------------------------------------------
సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వాలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయని, ముఖ్యంగా ఉచిత పథకాల అమలు వల్ల, దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందనీ, ఈ పథకాలను అమలు చేసి ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్నారనీ , ప్రజలలో పని సంస్కృతి నశిస్తుందనీ, కొంతమంది వేతన జీవులు చెల్లించే ఆదాయ పన్నుల ద్వారా సమకూరే నిధులను , పన్నులు చెల్లించని వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారనీ నోరున్న ఒక వర్గమూ, కొన్ని మీడియా సంస్థలూ వాదన చేస్తుంటాయి.
సాధారణ ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించని ఆర్ధిక వేత్తలే కాదు, దేశ ప్రధాని మోడీ కూడా ఉచిత , సంక్షేమ పథకాలపై విరుచుకుపడి మాట్లాడుతున్నాడు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ వాదనను తలకెక్కించుకుని వ్యాఖ్యలు చేస్తుంటుంది.. రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా అవకాశ వాదంతో వ్యవహరించడం చూస్తున్నాం.
ఈ నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత లేదా సబ్సిడీ పథకాల వల్ల ఒక చిన్నకారు రైతు కుటుంబానికి ఏ మేరకు మేలు జరుగుతుందో , దేశ, రాష్ట్ర చట్ట సభలు ఆమోదించిన చట్టాలు, జీవో లు హక్కుగా అమలు చేయక పోవడం వల్ల అదే కుటుంబానికి జరుగుతున్న నష్టం ఎంతో, ఈ రెండింటి మధ్యా పోలికతో ఆ కుటుంబానికి జరుగుతున్న నికర నష్టం ఎంతో తేల్చాలి.
ఉదాహరణకు తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాలున్న చిన్నకారు రైతు కుటుంబం ఉంది. రైతు జంట రెండెకరాలలో వరి, మూడెకరాల భూమిలో పత్తి సాగు చేస్తారు . స్వంత పొలంలో బోరు బావి ఉంది. కొడుకు ఇంటర్ ఫెయిలై 10 వేల జీతం తో షాప్ ఎంప్లాయ్ గా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు 9 వ తరగతి ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నది. ఆసరా పెన్షన్ పథకం జీవో ప్రకారం 57 సంవత్సరాలు దాటిన (వృద్ధాప్య పెన్షన్ కు అర్హులైన) ఇద్ధరు వృద్ధులు కూడా ఈ కుటుంబంలో ఉన్నారు. ఈ కుటుంబ నేపధ్యంతో మనం విషయాలను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రసాయన ఎరువులను అందించే పథకంలో ఈ రైతు కుటుంబానికి ఎకరానికి సీజన్ కు 8786 రూపాయలు , పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున సీజన్ కు 3,000 రూపాయలు సహాయంగా అందిస్తున్నది . రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రూపంలో సీజన్ కు ఎకరానికి 5,600 రూపాయలు, రైతు బంధు పెట్టుబడి సహాయ పథకం క్రింద సీజన్ కు 5,000 రూపాయలు మద్ధతుగా అందిస్తోంది.
అంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉచిత, సబ్సిడీ పథకాల రూపంలో స్వంత భూమి ఉన్న ఒక రైతుకు ఎకరానికి సంవత్సరానికి 22,386 రూపాయల విలువైన మద్ధతు అందిస్తున్నాయి.
జాతీయ వ్యవసాయ కమీషన్ 2006 నివేదిక (స్వామి నాథన్ కమీషన్) సిఫారసు ప్రకారం సిఏసిపి అంచనా వేసిన వరి పంట సమగ్ర ఉత్పత్తి ఖర్చు(సి2 ) కు ( 1805 X 22. 60= 40,793) 50 శాతం లాభం కలిపి (సి2 +50 శాతం) కనీస మద్ధతు ధర ( 2707,50)గా ప్రకటించాలి.
దీని ప్రకారం వరి పంటకు ఒక సీజన్ లో ఎకరానికి ( 2707X 22.60) 61178 రూపాయల ఆదాయం రావాలి. అంటే (61,178-40,793) 20,385 రూపాయల నికర మిగులు ఉండాలి. కానీ ఏ2 + ఎఫ్‌ఎల్(1360/-)పై ఆధారపడి క్వింటాలుకు 2060 రూపాయలు మాత్రమే కనీస మద్ధతు ధరగా ప్రకటించడం వల్ల (22.60X 2060) 46,556 రూపాయల ఆదాయం వస్తున్నది. అంటే (61,178 – 46,556 ) 14,622 రూపాయల నికర మిగులు ఉంటున్నది. అంటే ఎకరానికి 20,385 రూపాయల మిగులు ఉండాల్సిన చోట కేవలం 14,622 రూపాయల మిగులు మాత్రమే ఉంటున్నది.
పత్తి పంటకు సమగ్ర ఉత్పత్తి ఖర్చు( 5397 X 6.86 క్విం= 37,023 ) 50శాతం లాభం కలిపి ఎకరానికి ( 8095X 6.86 క్విం) ఎకరానికి 55,531 రూపాయల ఆదాయం రావాలి . కానీ పత్తి కనీస మద్ధతు ధర ఏ2 +ఎఫ్‌ఎల్ ( 4053/- ) పై ఆధారపడి 6300 రూపాయలు గా మాత్రమే ప్రకటించడం వల్ల (6300X6.86) 43,218 రూపాయల ఆదాయం మాత్రమే వస్తున్నది . అంటే పత్తిలో రైతు కుటుంబానికి ఎకరానికి నికర మిగులు (55,531 – 37,023 ) 18,508 రూపాయలు ఉండాల్సిన చోట ,కేవలం 12,313 రూపాయలుమాత్రమే నికర మిగులు ఉంటున్నది.
అంటే పత్తి, వరి కలసి ఎకరానికి ( 18,508 + 20,385 ) 38, 893 రూపాయల నికర మిగులు ఉండాలి. కానీ (14622 + 12,313 ) 26,935 రూపాయలు మాత్రమే ఉంటున్నది. అంటే రెండు ప్రభుత్వాలూ కలసి 22,326 రూపాయల విలువైన ఉచిత,సబ్సిడీ పథకాలు అమలు చేస్తుంటే రైతు కుటుంబానికి మిగులుతున్నది 26,935 రూపాయలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమీషన్ సిఫారసును అమలు చేయకపోవడం వల్ల ఈ మేరకు రైతు కుటుంబానికి నష్టం వాటిల్లుతున్నది.
మోడీ గారు, కోర్టులు ,కొంత మంది ఆర్ధిక వేత్తలు కోరుకుంటున్నట్లుగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రసాయన ఎరువులు ,ఉచిత విద్యుత్ అందించక పోయినా, రైతు బంధు, పిఎం కిసాన్ లాంటి నగదు బదిలీ పథకాలు అమలు చేయకపోయినా , పంటలకు సగటు ఉత్పత్తి ఖర్చులు మరింతగా పెరిగిపోయేవి . రైతులు మరింత నష్ట పోయే వారు. వినియోగ దారులపై మరింత భారం పడేది.
రసాయన ఎరువులు, ఉచిత విద్యుత్ లాంటి సబ్సిడీలు తప్ప వీటిలో కొన్ని ( రైతు బంధు , పిఎం కిసాన్ లాంటివి ) కౌలు రైతులకూ , ముఖ్యంగా భూమి లేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల పోడు రైతులకు అందవన్నది గుర్తుంచుకోవాలి. అంటే ఈ రైతులకు ఉత్పత్తి ఖర్చు మరింత పెరుగుతుందన్న మాట. ఆ మేరకు రైతు కుటుంబ నికర ఆదాయంలో కోత పడుతుందన్నమాట.
గత మూడేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయక పోవడం , పంట రుణాలపై వడ్డీ రాయితీ చెల్లించకపోవడం, సబ్సిడీ పై విత్తన పంపిణీ నిలిచిపోవడం వల్ల రైతు కుటుంబానికి సబ్సిడీ పథకాల సహాయం అందడం లేదు వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్,పెట్రోల్ రేట్లు,యంత్రాల కిరాయిలు కూడా పెరిగిపోవడం వల్ల మొత్తంగా పంటల ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని ఉత్పత్తి ఖర్చులను ప్రభుత్వాలు ధరల నిర్ణయ సమయంలో