ముండ్లమూరు : రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ లో గుంతలు పూడ్చివేత
ముండ్లమూరు మండలం పులిపాడు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి అండర్ పాస్లో ఏర్పడిన గుంతలను పోలీసుల చొరవతో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. ఎస్సై సంపత్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి గుంతలను మట్టితో చదును చేయించారు. దీంతో ప్రమాదాల నివారణకు కొంతవరకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. ఈ సందర్భంగా అద్దంకి- దర్శి రాకపోకలు చేస్తున్న వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు
