Ram Gopal Varma: పవన్ కల్యాణ్ కు ఆయన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదు: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: పవన్ కల్యాణ్ కు ఆయన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదు: రామ్ గోపాల్ వర్మ

BSR NEWS 

  • 24 సీట్లకే జనసేన పరిమితం కావడంపై వర్మ సెటైర్లు
  • గతంలో ఓటమి కారణంగా ఎక్కువ సీట్లు అడగలేకపోయానని పవన్ చెపుతున్నారన్న వర్మ
  • రాజకీయాల్లో పవన్ శైలి విరుద్ధంగా ఉందని విమర్శ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడంపై ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తూ... గత ఎన్నికల్లో జనసేన గెలవలేకపోడం వల్ల ఎక్కువ సీట్లను అడగలేకపోయానని పవన్ చెపుతున్నారని ఎద్దేవా చేశారు. 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత... ఆయన తర్వాతి సినిమా కూడా ఎక్కువ థియేటర్లలోనే విడుదలయిందని... థియేటర్ల సంఖ్య తగ్గలేదని చెప్పారు. కానీ, రాజకీయాల విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. పవన్ కు తన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదని చెప్పారు.