Jagan: వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు

Jagan: వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు
  • BSR NEWS
  • 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్
  • జగన్ ను మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యమన్న అచ్చెన్నాయుడు
  • వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిపోయారన్న ధూళిపాళ్ల
  • ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రాఫ్ బాగోలేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేందుకు వైసీపీ రెడీ అయింది. 11 నియోజకవర్గాలకు వైసీపీ నూతన ఇన్ఛార్జీలను నియమించింది. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడంపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 

    వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులనే కాదు... ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ను మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉండేది మరో మూడు నెలలు మాత్రమేనని అన్నారు. 

    ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని... ఇప్పుడు మీరు ఎంత మందిని మార్చినా ఫలితం శూన్యమని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చుకుంటూ పోతే... పులివెందుల సహా మొత్తం 151 మందిని మార్చాల్సిందేనని అన్నారు.
  • JAGAN  ACHHENNAYUDU DHULIPALLA NARENDRA TELUGUDEDSAM YSRCP