CM Jagan: బరిలోకి జగన్.. ఇక తగ్గేదే లేదట

CM Jagan: బరిలోకి జగన్.. ఇక తగ్గేదే లేదట

BSR NEWS

రాష్ట్రవ్యాప్తంగా 62 చోట్ల అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చాలామందికి టిక్కెట్లు ఇవ్వలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల్లో చావో రేవో కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తన వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను పక్కనపెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. తాజాగా ఒకేసారి 11మంది అభ్యర్థులకు స్థానచలనం కల్పించి సంచలనానికి తెర తీశారు. ముగ్గురు సిట్టింగ్ లకు టిక్కెట్లు లేవని తేల్చేశారు. అందులో తనకు సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండడం విశేషం. దీనిని బట్టి భారీ ప్రక్షాళనకు దిగినట్లు తెలుస్తోంది. సీనియర్లకు సైతం ఉద్వాసన తప్పదని సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

రాష్ట్రవ్యాప్తంగా 62 చోట్ల అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చాలామందికి టిక్కెట్లు ఇవ్వలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ జాబితాలో కొందరు మంత్రులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను జగన్ ఒక గుణపాఠంగా భావిస్తున్నారు. అందుకే ఎక్కడ భేషజాలాలకు పోకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావడం జగన్ ముందున్న కర్తవ్యం. అందుకే ఎంతటి సాహసవంతమైన నిర్ణయానికైనా దిగాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రుల స్థాయిలో ఉన్న ఆదిమూలపు సురేష్, విడదల రజిని, నేరుగా నాగార్జున లాంటి వాళ్లని తమ నియోజకవర్గాల నుంచి తప్పించి.. వేరే నియోజకవర్గం నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం తప్పదని భావిస్తున్నారు. ఇందులో కొందరు నేతలకు ప్రత్యామ్నాయంగా కుటుంబ సభ్యులను తెరపైకి తెస్తున్నారు. ఈ మార్చబోయే 60 మందిలో కనీసం 30 మంది గెలుస్తారని జగన్ భావిస్తున్నారు. అయితే ఎక్కడా మనస్థాపాలకు, తిరుగుబాటులకు తావు లేకుండా చూస్తేనే జగన్ ఇంతటి సాహస నిర్ణయానికి గౌరవం దక్కేది. లేకుంటే మాత్రం డేంజర్ బెల్స్ మోగినట్టే.

ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఇప్పుడు గానీ మొదలు పెట్టకపోతే.. తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఫలితాలు రిపీట్ అవుతాయని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎటువంటి మొహమాటలకు పోకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న మూడు నెలల కాలాన్ని జగన్ ఎంత సమర్థంగా వినియోగిస్తారు అన్న దానిపై 175 లో ఎన్ని సీట్లు గెలుస్తారు అన్నది తెలుస్తుంది. ఈ రెండు నెలల పాటు రాజకీయం ఇప్పుడు జగన్ కు కీలకం. ఇప్పుడు అన్నింటికంటే పార్టీ ఆయనకు ముఖ్యం. తన సన్నిహితులను తప్పించినా.. పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో మూలంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. వారి సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి జగన్ పై ఉంది. ఇది ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే భారీ ప్రక్షాళనకు దిగేముందు దాని ఫలితాలు, పర్యవసానాలను జగన్ తప్పకుండా ఆలోచించి ఉంటారు.