తవణంపల్లి మార్చ్ 12 పబ్లిక్ టుడే: మండలంలోని అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామాగ్రిని యువరాజ్ స్వేరో వితరణ చేయడం జరిగింది BSR NEWS

విద్యార్థులకుపరీక్షా సామాగ్రివితరణ
తవణంపల్లి మార్చ్ 12 పబ్లిక్ టుడే: మండలంలోని అరగొండబాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామాగ్రిని యువరాజ్ స్వేరో వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువరాజ్ స్వేరో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ పరీక్షలు ఈనెల మార్చ్ 17వ తారీకు నుండి ప్రారంభమవుతుందని పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వాలని విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. అలాగే పరీక్ష సమయంలో విద్యార్థుల వద్ద బస్సు పాసు లేకపోయినా హాల్ టికెట్ చూసి బస్సులో ఎక్కించుకోవాలని, విద్యార్థులు చెడు మార్గాలలో వెళ్లకుండా, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, తెలిపారు. అనంతరం భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి, క్రీడల అభివృద్ధికి, తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు యువకులు పార్థసారథి, అజిత్, శ్రీరాములు, చిన్న, హర్ష, వినయ్, తదితరులు పాల్గొన్నారు.