YS Sharmila: షర్మిలను దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రశ్నించిన సామాన్యుడు

BSR NEWS
తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల.. అక్కడ అనుకున్నంత వర్కౌట్ కాలేదు. అక్కడి రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయలేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
BSR NEWS LOCAL AD
Click Here To Call Us For Your Ads Here
YS Sharmila: పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలను, ప్రజా ప్రతినిధుల అవినీతిని ప్రశ్నిస్తున్నారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల అమలు వంటి విషయంలో న్యాయం చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు ఆమె టార్గెట్ అవుతున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా సైతం షర్మిలను టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. షర్మిల మాత్రం అవేవీ పట్టించుకోకుండా వైసీపీ సర్కార్ పై పెద్ద యుద్ధం ప్రకటించారు. దీనిని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల.. అక్కడ అనుకున్నంత వర్కౌట్ కాలేదు. అక్కడి రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయలేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి ఊరు వాడా ప్రచారం చేసి వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా, ఇతరత్రా అంశాల్లో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే ఇది వైసిపి శ్రేణులకు మింగుడు పడని విషయం. దీంతో షర్మిలను వైసీపీ శ్రేణులు ఆడిపోసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సైతం లేనిపోని ప్రచారం చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆమె నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. ఓ గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. స్థానికుల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ తరుణంలో ఓ యువకుడు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. జగనన్న వదిలిన బాణంగా.. నాడు కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేక ప్రచారం చేసిన మీరు.. ఎందుకు తిరుగుబాటు చేశారని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి తమలాంటివారు మీ కుటుంబం వెంట నడిచారని.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేం అండగా నిలిచామని.. అందరి దయతో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. అంతా మంచి జరుగుతుందనుకుంటే… ఏ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారో.. అదే పార్టీ నీడలోకి వెళ్లడం భావ్యమా అని ఆ యువకుడు ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువకుడు వినలేదు. తాను చెప్పదలుచుకున్నది.. షర్మిల ఎదుట స్పష్టం చేశాడు. దీంతో ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యింది. సమాధానం ఎలా చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.