Congress: నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ.. తెలంగాణలో మిగతా 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక

Congress: నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ.. తెలంగాణలో మిగతా 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక

BSR NEWS

  • ఇప్పటికే నాలుగు స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్
  • నేడు ఎంపిక చేసి రేపు ప్రకటించనున్న సీఈసీ
  • వలస నేతలకూ టికెట్లు!

తెలంగాణ నుంచి లోక్‌సభకు బరిలోకి దిగే కాంగ్రెస్ అభ్యర్థులు నేడు ఫైనల్ కానున్నారు. ఇప్పటికే నాలుగు స్థానాలు.. జహీరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, చేవెళ్ల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ రోజు భేటీ కానుంది. 

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసి రేపు ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలస వస్తున్న నేపథ్యంలో వారిలో బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థల ప్రకటన ఆలస్యమైనట్టు సమాచారం.