దేశంలోనే అతి చిన్న రైలు గురించి మీకు తెలుసా? ఆ రైలు ఎక్కడ చేయి ఎత్తిన ఆపుతుంది!

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్క్ వర్క్‌లో భారత్ కూడా ఒకటి. ఇక భారతీయ రైల్వేలో ప్యాసింజర్ రైలు, ఎక్స్‌ప్రెస్ ట్రైన్, సూపర్ ఫాస్ట్, వందేభారత్, గూడ్స్ ట్రైన్ ఇలా అనేక రకాల రైళ్లు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో మోడల్ ట్రైన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే భారతీయ రైల్వేలో కేవలం 3 బోగీలు మాత్రమే ఉన్న ట్రైన్ కూడా ఉంది. ఇది ఇండియా లోనే అతి చిన్న ప్యాసింజర్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రయాణికులను తరలించే రైళ్లకు 18 నుంచి 20 బోగీలు ఉంటాయి. సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు అయితే 50 నుంచి 60 వరకు బోగీలు ఉంటాయి. కానీ కేరళ రాష్ట్రంలో ప్రయాణికులను తరలించే ఓ ట్రైన్‌కు కేవలం మూడు బోగీలు మాత్రమే ఉన్నాయి. కొచ్చిన్ హార్బర్ టెర్మినల్ నుంచి ఎర్నాకుళం జంక్షన్ వరకు ఇది ప్రయాణికులను తరలిస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉండే ఈ డెమూ రైలులో 300 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుంది. రోజూ రెండుసార్లు, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఈ రైలు గురించి మరో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఒకే స్టాప్‌తో 40 నిమిషాల్లో కేవలం 9 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ ట్రైన్ తర్వాత యూపీలోని ఐత్ కొంచ్ షటిల్ రైలు కూడా మూడు బోగీలు కలిగిన అతి చిన్న రైలుగా నమోదైంది. కొంచ్ నగర్ నుంచి జలౌన్ సర్సౌకి స్టేషన్ వరకు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం స్టేషన్లలోనే కాకుండా మార్గమధ్యంలో ఎక్కడ చేయి ఎత్తినా ఆపడం ఈ రైలు విశేషం.