నాగంబొట్లపాలెంలో షాక్ కు గురైన దంపతులు
తాళ్లూరు మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది.మండలంలోని నాగం బొట్లపాలెంలో పిడుగు పడటంతో సంపత్ నాగరాజు గొర్రె మందలో ఒక మేకపోతు మృతి చెందింది.నాగరాజు దంపతులతో పాటు 15 గొర్రె పిల్లలు షాక్కు గురయ్యాయి.తృటిలో ప్రాణాపాయం తప్పడంతో నాగరాజు దంపతులు ఊపిరి పీల్చుకున్నారు..
