నూతన జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జాషువా BSR NEWS

నూతన జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జాషువా
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా జాషువా పదవీ బాధ్యతలు ఆదివారం స్వీకరించారు. పోలీస్ అధికారులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో డిఎస్పీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడతామన్నారు. అక్రమ మద్యంపై గట్టి నిఘా పెంచుతామన్నారు. అందరి సమన్వయంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.