మీ బావ అవినీతి కనిపించదా పున్నమ్మా?: VSR. BSR NESW

మీ బావ అవినీతి కనిపించదా పున్నమ్మా?: VSR
టీడీపీ హయాంలో మద్యం ప్రివిలేజీ ఫీజు తొలగించడంతో చంద్రబాబు, కొల్లు రవీంద్ర రూ.1,300 కోట్లు కొల్లగొట్టారని YCP ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 'బాబు నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ. 1,500 కోట్ల ఆదాయానికి గండిపడింది. మద్యం విధానం ముసుగులో టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంది. ఇవేమీ పురందీశ్వరికి కనిపించవు. దీనిని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేందుకు పున్నమ్మ ప్రయత్నం?' అని మండిపడ్డారు.