Jagan: సీఎం జగన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

BSR NEWS
- నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
- హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి లేచిన చీపురు
- చీపురు హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశృతి చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు అక్కడున్న ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దీన్ని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ను కొద్దగా పైకి లేపారు. ఒక వేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని నిపుణులు చెపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.