వైసిపి విజయమే మన లక్ష్యం: సునీల్ కుమార్ BSR NEWS

వైసిపి విజయమే మన లక్ష్యం: సునీల్ కుమార్
వైసిపి పార్టీ విజయమే మన లక్ష్యమని పూతలపట్టు వైసిపి ఇన్చార్జ్ సునీల్ కుమార్ తెలిపారు. కాణిపాకంలో ఐటీ టీంతో శనివారం సమావేశం నిర్వహించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిపించారని, 2024లో కూడా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సీఎం జగన్ సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఎన్నికల్లో వైసిపి ఘన విజయానికి కృషి చేయాలన్నారు.