కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.45 కోట్లు BSR NEWS

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.45 కోట్లు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. రూ.1.45 కోట్ల ఆదాయం లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. 22 రోజులు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించారు. 30 గ్రాముల బంగారం, 4. కిలోల వెండి లభించిందన్నారు. ఏఈవోలు కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ, సూపర్డెంట్లు కోదండపాణి, శ్రీధర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.