యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే ఆడుదాం ఆంధ్ర BSR NESW

యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే ఆడుదాం ఆంధ్ర BSR NESW

యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే ఆడుదాం ఆంధ్ర

ప్రతిభ చూపిన క్రీడాకారులకు పదివేల రూపాయల సొంత నిధులు అందజేసిన వైస్ ఎంపీపీ రోజా ప్రభాకర్ రెడ్డిఐరాల (ఎంపైపల్లి )యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉందని వైస్ ఎంపీపీ రోజా ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ఎంపై పల్లి పంచాయతీ పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు, గ్రామాల పరిధిలోని యువతకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి, మోటకంపల్లి గ్రామ యువత క్రికెట్ పోటీల్లో జట్లుగా తలపడగా జంగాలపల్లి యువత విన్నర్స్ గాను, మోటకంపల్లి యువత రన్నర్స్ గానూ నిలిచారు.ఈఓఆర్ డి కుసుమకుమారి, స్థానిక అధికారులు ప్రమీల,ప్రసాద్ సమక్షంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి వైస్ ఎంపీపీ రోజా ప్రభాకర్ రెడ్డి మొదటి బహుమతిగా ₹ 5116లు, రెండవ బహుమతిగా ₹ 3116, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చరణ్ 1116 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మణికంఠన్ - 1116/- లు సొంత నిధులను అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి భోజనం వసతి ని ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మునస్వామి రెడ్డి, యువ నాయకులు చంటి పలువురు యువత సభ్యులు, ప్రజలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న యువత, వారికి నగదు అందజేస్తున్న ప్రముఖులు