కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి రేణిగుంట మండలానికి చెందిన దాత దాసరి రాంప్రసాద్ బుధవారం విరాళం అందజేశారు BSR NEWS

కాణిపాకం: ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి రేణిగుంట మండలానికి చెందిన దాత దాసరి రాంప్రసాద్ బుధవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి రూ.2.50 లక్షలు విరాళం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.