ఐరాల: విద్యార్థులకు పోటీలు BSR NESW

ఐరాల: విద్యార్థులకు పోటీలు
ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి సుజాత తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలు వెలికి తీసేందుకే పోటీ పరీక్షలు నిర్వహించామన్నారు. పాఠశాల హెచ్ఎం కోమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.