ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దరశిలోని 'డాక్టర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల'లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కొండలరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ"(IRCS)ఎగ్జికూటివ్ మెంబర్ మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా,1970 వ సంవత్సరంలో ఒంగోలు జిల్లాగా వున్న పేరును మార్చి, 1972 వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా నామకరణానికి కారణభూతులైన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి  స్వర్గీయ టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాల వేసి, ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేసించి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...., ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తలతో,మార్కాపురం పలకలతో,చీమకుర్తి గెలాక్షీ గ్రానైట్ తో ప్రపంచ ప్రఖ్యాతిఘఢించిందని,ఆసియాఖండం లోనే మన కంభం చెరువు  అతిపెద్దదని,పర్యాటక రంగంలో సముద్ర తీర ప్రాంత బీచ్ లు, ప్రకృతి సోయగాలతో మనసును  పులరింపజేసే భైరవకోన,నెమలిగుండ్ల రంగస్వామి గుండం,చందవరం భౌధ్ధస్తూపాలు చూపరులను మంత్రముగ్దులను చేస్తాయని, ప్రపంచ దేశాలు గర్వపడేవిధంగా భారతదేశ  జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య,కవి యర్రాప్రగఢ,ఆధునిక సాంకేతిక నిపుణులు,ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య,శాస్త్రీయ సంగీత పితామహుడు త్యాగరాజు, ఇంకా ఎందరో మహానుభావులు,స్వాతంత్య్ర సమరయోధులు నడయాడినటువంటి ప్రాంతం  ప్రకాశం జిల్లా అని, మన జిల్లా కీర్తి ప్రతిష్టలను ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ వుండాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సుశీలమ్మ ,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.