కాణిపాకంలో 25న హనుమాన్ చాలీసా పారాయణం BSR NEWS

కాణిపాకంలో 25న హనుమాన్ చాలీసా పారాయణం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీన ఆస్థాన మండపంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు, ఉభయ దారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈఓ కోరారు