అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో తరఫున ఉచిత అత్యవసర వైద్య సేవల కేంద్రం ప్రారంభించినట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలిపారు BSR NEWS

అయోధ్యలో అపోలో క్రిటికల్ కేర్: ఉపాసన
అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో తరఫున ఉచిత అత్యవసర వైద్య సేవల కేంద్రం ప్రారంభించినట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలిపారు. 'జాలి, దయలోనే నిజమైన సనాతన ధర్మం ఉంటుందని మా తాత ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలే స్ఫూర్తిగా ఉచితంగా అత్యవసర వైద్య సేవల్ని రామమందిరం వద్ద అందిస్తున్నాం. ఇప్పటికే శ్రీశైలం, తిరుమల, కేదార్నాథ్, బద్రీనాథ్ వద్ద ఇవి ఉన్నాయి. జై శ్రీరామ్' అని ట్వీట్ చేశారు.