Actress Maadhavilatha: 'నా ఆత్మగౌరవంపై దాడి జరిగింది'.. బోరున ఏడ్చేసిన మాధవీలత.. వైరల్ వీడియో!

- ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన మాధవీలత
- తాను ఎవరికీ ద్రోహం చేయలేదన్న హీరోయిన్
- కక్షగట్టి మాటలు అంటున్నారని ఆవేదన
- ఆడిపిల్లగా సింపథీ గేమ్ ఆడకుండా మగాడిలా పోరాడుతున్నానన్న నటి
నటి, బీజేపీ నేత మాధవీలత ఏడుస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ ఆమె బోరున ఏడ్చేశారు. తాను ఎవరికీ ద్రోహం చేయలేదని, కక్షగట్టి మాటలు అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఆడిపిల్లగా సింపథీ గేమ్ ఆడకుండా మగాడిలా పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. ఈ కష్టాలను అధిగమిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
"చాలా ప్రయత్నం చేశా. కానీ నేనూ మనిషినే. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడితో నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం... అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న.