Noida: మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

Noida: మొక్కలకు నీళ్లు పోస్తూ 18వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

BSR NEWS

  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఘటన 
  • బాలిక ప్రమాదవశాత్తూ జారిపడి మరణించిందన్న పోలీసులు
  • అంతకుముందు, 22వ అంతస్తు నుంచి దూకి 7వ తరగతి బాలుడి ఆత్మహత్య

ప్రమాదవశాత్తూ 18వ అంతస్తు నుంచి జారిపడ్డ ఓ 12వ తరగతి బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ బాలిక (18) జారి పడిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదశవాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. బిసార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందిందని ఓ ప్రకటన తెలిపారు. ఇటీవలే ఆమె 12వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు. 

అంతకుముందు రోజే, నోయిడాలో ఓ 7వ తరగతి బాలుడు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 22వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు.