ఐరాల: కాణిపాకంలో భక్తుల రద్దీ BSR NESW

ఐరాల: కాణిపాకంలో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం భక్తుల రద్దీతో ఆదివారం కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం వచ్చారు. ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రతి భక్తుడికీ స్వామి దర్శనం కల్పించడానికి అధికారులు కృషి చేశారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఛైర్మన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.