కాణిపాకం ఆలయ పవిత్రతను కాపాడండి చిత్తూరు కలెక్టరు గారికి, పూతలపట్టు ఎంఎల్ఎ గారికి మరియు స్థానిక ప్రజలకు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సూచన :BSR NEWS

BSR NEWS CHTTOOR 09.09.2024:
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కాణిపాకం శ్రీ వర సిద్ది వినాయక స్వామి దేవాలయము ఒకటిగా పేరొందిన విషయం మన అందరికి తెలిసిందే అని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సోమవారం పత్రిక ముఖంగా తెలియజేశారు. రాష్ట్ర, దేశ, విదేశాల నుండి వేలాది మంది భక్తులు ప్రతి రోజు స్వామి వారి ని దర్శించుకొని తమ మొక్కులను తీర్చు కుంటున్నారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తి బావాలు పెంపొందించేలా ఆలయ పరిసరాలను సుమారు 500 ల మీటర్ల విస్తీర్ణంలో తీర్చి దిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ఆలయం నుండి అగరంపల్లి వద్ద గల ఆర్చి వరకు ఐరాల క్రాస్ వద్ద కొత్తగా నిర్మించిన ఆర్చి వద్ద వివిధ రాజకీయ నాయకుల బ్యానెర్లతో వ్యాపార ప్రకటనలతో నిండి ఉన్నది. దీని వలన భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఆ దారిలో వెలుతూ ఈ వింత పోకడలను చూసినప్పుడల్లా మనసుకు కష్టం కలుగుతున్నది. నేను చెంద్రగిరి ఎమ్మెల్యే గా, మంత్రి గా ఉన్నప్పుడు ఈ ఆలయ పరిసరాల నుండి ఆర్చి ముందు వరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు గాని, రాజకీయ వ్యాపార బ్యానెర్లను ఉంచరాదని తీర్మానం చేయించి అమలు చేయడం జరిగినది. ముఖ్యమంత్రు లు వచ్చినప్పుడు కూడ ఈ నియమాన్ని పాటించడం జరిగింది. ఇందుకు ఆలయ ఉభయదారులు, వివిధ రాజకీయ పక్షాలు అన్ని వర్గాల ప్రజలు తమ పూర్తిసహకారాన్ని అందించడం జరిగింది. తద్వారా భక్తులు భక్తి భావంతో గుడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆనందంగా తిరిగి వెళ్లే వారు. గత కొన్ని సవత్సరములుగా తిరిగి ఆలయ పరిసర ప్రాంతాల పవిత్రత దెబ్బతినే విధంగా వివిధ రాజకీయ వ్యాపార బ్యానర్లతో నిండి ఉన్నది. ఇంత జరుగుతున్న ఆలయ అధికారులు గాని, స్థానిక పోలీసులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రాష్ట్ర, దేశ, విదేశాల నుండి వచ్చే భక్తుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఇందుకు గాను ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి భావాలతో ఉట్టి పడేలా తీర్చిదిద్ద వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున కలెక్టరు సుమిత్ కుమార్, స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, సంబంధిత ఆలయ అధికారులకు తగు సూచనలు చేసి ఆలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు బ్యానర్లకు చోటు ఇవ్వకుండా భక్తి పారవశ్యం పెంపొందించే విధంగా వెంటనే తగు చర్యలు తీసుకొనగలరని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తెలిపారు.