Pawan Kalyan : మెగాస్టార్‌కి పోటీగా పవర్ స్టార్ ? ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ అప్పుడే..

BSR NEWS
తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
Chiranjeevi – Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా సినిమాలని ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఇటీవల సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు పవన్. పవన చేతిలో ప్రస్తుతం OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసారు. ఇక OG సినిమాకి ఇంకొక షెడ్యూల్ పవన్ డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది. OG సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇక క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో AM రత్నం నిర్మాణంలో హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రకటించారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో, పవన్ మొదటిసారి పీరియాడిక్ సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేయడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.