మారుతున్న రాజకీయ ముఖాలు

మారుతున్న రాజకీయ ముఖాలు

దేశంలో రాజకీయాలకు అర్థం మారుతోంది. ఒకప్పుడు ప్రజాసేవ, పార్టీ, సిద్ధాంతాలు, నిస్వార్థం అనే భావనతో నాయకులు ఉండేవారు. కానీ ఇప్పుడు సిద్ధాంతాలను గాలికి వదిలేశారు. ఇక ప్రజలకు సేవ చేయడం కూడా క్రమంగా వదిలేస్తున్నారు. నిస్వార్థం నేతల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. తమ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలో కేసులపాలవుతున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్‌ అన్నట్లుగా మారిపోతున్నారు ప్రజాప్రతినిధులు. ఇక ముఖ్యమంత్రులు కూడా వీటికి అతీతం కాదు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఎక్కువ కేసులు ఉన్న ఐదు గురు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకుందాం