చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం BSR NEWS

చిత్తూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం
కార్వేటి నగరం మండలం సిద్దగుంట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జనార్దన్ అనే మాంత్రికుడు తన ఇంట్లో ఓ మహిళ చేత క్షుద్ర పూజలు చేయిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గత మూడు నెలలుగా ఇదేవిధంగా మహిళ చేత క్షుద్ర పూజలు చేయిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.