ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్ట్ -ఎమ్మెల్సీ దొరబాబు- BSR NEWS

BSR NEWS: చిత్తూరు: 'ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్ట్' వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఎలాంటి అక్రమాలు చేయకున్నా.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.