వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు పూర్తి..! కాసేపట్లో పూర్తి జాబితా విడుదల

వైసీపీలో మార్పులు చేర్పుల కసరత్తు పూర్తి..! కాసేపట్లో పూర్తి జాబితా విడుదల

 వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు.

ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి జాబితా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించగా.. మిగిలిన మార్పులన్నీ ఒకేసారి అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.