బంగారుపాళ్యం: లారీని ఢీకొట్టిన కారు: BSR NEWS

బంగారుపాళ్యం: లారీని ఢీకొట్టిన కారు

బంగారుపాళ్యం మండలం తిమ్మాజిపల్లె సచివాలయ సమీపంలోని తిరుపతి-బెంగళూరు హైవే రోడ్డుపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం కాగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో బంగారుపాలెం, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.