పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర వేసిన మురళిమోహన్ 15,870 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన మురళిమోహన్ BSR NEWS

పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర వేసిన మురళిమోహన్  15,870 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన మురళిమోహన్ BSR NEWS

పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర                               వేసిన మురళిమోహన్

     15,870 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన                                                మురళిమోహన్

చిత్తూరు -పూతలపట్టు (ఎన్ టైమ్స్ న్యూస్ )జూన్ 04 : పూతలపట్టు ప్రజానీకంకు సేవ చేసుకునే భాగ్యంను కల్పించిన నా దేవుడు చంద్రబాబు నాయుడుకి, మా యువ నాయకుడు నారా లోకేష్ ఆ జన్మాంతం రుణపడి ఉంటానని పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళిమోహన్ అన్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున 15,870 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను పాతారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళిమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు పూతలపట్టు ప్రజలకు సేవ చేసే భాగ్యంను కల్పించినందుకు వారికి జన్మ జన్మల రుణ పడి ఉంటానన్నారు. పూతలపట్టు ప్రజల జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెంది తనను అఖండ విజయంతో గెలిపించినందుకు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనం తెలియజేశారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకంను వమ్ము చేయకుండా ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాననని తెలిపారు.