రేపు టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం AP: BSR NEWS

రేపు టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం AP: BSR NEWS

టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం రేపు రాజమహేంద్రవరంలో జరగనుంది. మంజీరా కన్వెన్షన్ లో సోమవారం మ.3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఇరు పార్టీల నుంచి ఐదుగురు చొప్పున సమన్వయ కమిటీ సభ్యులు నియమితులు కాగా.. వీరితో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, 2 పార్టీల సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.