జగన్ ఒక్క దానికీ అనుమతి ఇవ్వలేదు: పెద్దిరెడ్డి BSR NESW

జగన్ ఒక్క దానికీ అనుమతి ఇవ్వలేదు: పెద్దిరెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. 'మద్యం విషయంలో ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి పురందేశ్వరి మాట్లాడటం సరికాదు. చంద్రబాబే మద్యం డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. సీఎం జగన్ ఒక్క దానికీ పర్మిషన్ ఇవ్వలేదు. పురందేశ్వరి బాబుతో మాట్లాడితే అసలు నిజాలు తెలుస్తాయి. ఆమె బీజేపీ నేతగా కాకుండా చంద్రబాబు వదినగా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు' అన్నారు.