హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ దామోదర్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు - ఎస్పీ.

జిల్లా ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ ఐపీఎస్
మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి:జిల్లా ఎస్పీ
హోలీ పండగ రోజు సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం
ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు...ఇబ్బంది కలిగించవద్దు. మహిళల పట్ల మర్యాదగా ఉండాలి. ప్రధాన కూడలి, కాలనీలు, రహదారులపై సిసి కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నాం
రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేయడం లేదా ఏవేని సమస్యలకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవు
ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రకాశం జిల్లా ఎస్పీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకుండా ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలన్నారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి అన్నారు.
జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సిసికెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్ కెమెరాల నిఘా ఉన్నదని, వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని ఎస్పీ గారు తెలిపినారు. ఎవరైనా కించపరిచేలా లేదా రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేయడం లేదా ఏవేని సమస్యలకు కారణమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి పండుగ పర్వదినాల సందర్భంగా ముఖ్యంగా యువత ఆదర్శంగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలపై వేగంగా మరియు సైలెన్సర్లు తోలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్ళరాదన్నారు. ఎదుటివారిని ఇబ్బంది కలిగించవద్దని, మహిళల పట్ల మర్యాదగా ఉండాలని తెలిపారు.ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు.
పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.