చిత్తూరులో ప్రమాదకరంగా రోడ్డు BSR NESW

చిత్తూరులో ప్రమాదకరంగా రోడ్డు చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద రహదారిపై రాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. డీఈవో కార్యాలయం సమీపంలో సర్కిల్ వద్ద రోడ్డుపై గుంత ఏర్పడింది. అందులోని రాళ్లు తేలిపోయాయి. అసలే నాలుగు రోడ్ల కూడలి. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ప్రాంతమిది. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.