ప్రధానాంశాలు: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం ప్రభుత్వ బడులకు నైట్ వాచ్మెన్లు మార్గదర్శకాలు జారీచేసిన విద్యాశాఖ BSR NESW

ప్రధానాంశాలు:  ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం ప్రభుత్వ బడులకు నైట్ వాచ్మెన్లు మార్గదర్శకాలు జారీచేసిన విద్యాశాఖ BSR NESW

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు- నేడు కింద అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. తాజాగా బడుల్లో భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా ఉండటం సహా స్కూల్ ఆవరణలోని పరికరాల భద్రత కోసం నైట్ వాచ్మెన్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై ఏపీ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది.