Kim Jong-un: మమ్మల్ని రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. ఉత్తరకొరియా అధినేత హెచ్చరిక

BSR NEWS
- ఖండాంతర క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్‌కు హాజరైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్
- అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగం
- శత్రువులు తమను అణుదాడితో రెచ్చగొడితే తామూ అదే రీతిలో స్పందిస్తామని వార్నింగ్
ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది.