ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు

BSR NEWS

కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ పై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు 

ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. 

వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని....ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని, పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.*

వక్ఫ్ సవరణ చట్టంపై అభ్యంతరాలను వివరించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నాశ్యం మహమ్మద్ ఫరూక్ గారి ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఫజులుర్ రహీం గారు, మౌలానా అబు తాలిబ్ రెహ్మని గారు,   మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు, ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తదితరులు కలవడం జరిగింది.